తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు గురువారం రాత్రి హంస వాహనంపై శ్రీ సోమస్కంధముర్తికి, పల్లకీలో శ్రీ కామాక్షి అమ్మవారికి ఆస్థానం నిర్వహించారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమం ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
ఆది దంపతులైన స్వామి, అమ్మవార్లు హంస మిథునం(దంపతులు)లా గోచరిస్తారు. వారి వల్లనే అష్టాదశ విద్యలు పరిణమించాయి. పాలను, నీటిని వేరు చేసే వివేకం అలవడింది. కపిలాది యోగీశ్వరుల మానస సరస్సులో హంస జంటగా స్వామి, అమ్మవారు అనుగ్రహిస్తారు.