గజ వాహ‌నంపై రాజాధిరాజుగా శ్రీ కల్యాణ వెంకన్న


శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం రాత్రి స్వామివారు రాజాధిరాజుగా గజ వాహనంపై అభయమిచ్చారు.

ఏనుగు ఐశ్వర్యానికి ప్రతీక. రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాధిష్ఠితులను చేసి ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సివస్తే గజారోహణం కావించే ప్రక్రియ నేటికీ ఉన్నది. విశ్వానికి అధిష్ఠానమూర్తి అయిన శ్రీనివాసుడు గజాన్ని అధిష్ఠించడం – జగత్తునూ, జగన్నాయకుణ్ణీ ఒకచోట దర్శించే మహాభాగ్యానికి చిహ్నం. స్వామి గజేంద్ర రక్షకుడు కనుక అందుకు కృతజ్ఞతగా ఏనుగు స్వామికి వాహనమై, స్వామివారిసేవలో ధన్యం కావడం మహాఫలం.

Source