తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నిర్వహించే డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను భక్తుల కోరిక మేరకు ఆదివారం నుండి ప్రారంబించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆర్జిత సేవలను టిటిడి ఇంతవరకూ ఏకాంతంగా నిర్వహిస్తోంది. దాదాపు 226 రోజుల తరువాత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయం బయట భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని టిటిడి కోరుతోంది.