తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం సాయంత్రం పౌర్ణమి గరుడసేవ జరిగింది.
శ్రీ మలయప్పస్వామివారిని అలంకరించి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేంచేపు చేశారు. కోవిడ్-19 కారణంగా ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, పోటు పేష్కార్ శ్రీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.