తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉట్లోత్సవ ఆస్థానం నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనల మేరకు ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణులు, శ్రీకృష్ణస్వామివారిని ముఖ మండపంలో వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయదారులు ఉభయాలు సమర్పించారు.