ఏనుగు బొమ్మలు ఇంట్లో పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఎలాంటి వాటిని పెట్టుకోవాలి? అనే సందేహాలు చాలా మందికి కలుగుతున్నాయి. వాటిని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం.
ఏనుగు సౌమ్యజీవి, ప్రశాంతంగా కనిపిస్తుంది. శాఖాహారి. ఏనుగు ముఖంలో ప్రశాంతత కనిపిస్తుంది. అందుకే ఏనుగు శుభశూచికగా భావిస్తారు. అలాగే ఏనుగు తొండం ఎత్తి ఘీంకరిస్తే అది విజయానికి సంకేతంగా చెబుతారు. అందుకే మన ఇంట్లో ఏనుగు బొమ్మలను పెట్టుకుంటే శుభ సూచిక అని విజయాలకు ప్రతీక అని చెబుతున్నారు పెద్దలు.
ఏనుగు తొండం పైకెత్తి ఉన్నట్టుగా ఉండే బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటే మంచిది. అవి మన ఇంట విజయాలకు సంకేతాలుగా నిలుస్తాయి. వినాయకుడికి విఘ్నేశ్వరుడనే ఇంకో పేరు కూడా ఉంది. ఆయన మనకు కలిగే విఘ్నాలను తొలగిస్తాడు. ఈ క్రమంలోనే ఆయన్ను ప్రతిబింబించేలా వెండి ఏనుగు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే మనకు అనేక విషయాల్లో విజయాలు కలుగుతాయి .
వెండి, పాలరాయి, ఇత్తడి, పంచలోహం, మట్టి వంటి వాటితో చేసిన ఏనుగు బొమ్మలు పెట్టుకోవచ్చు. వీటన్నింటిలో వెండి, పాలరాయి శ్రేష్టమైనవి. ఏనుగు బొమ్మకు సైజుతో సంబంధం లేదు. ఏ సైజులో ఉన్న ఏనుగు బొమ్మ అయినా సరే.. ఇంట్లో లేదా ఆఫీస్‌లో పెట్టుకుంటే సమస్యలు పోతాయి.
ఈ ఏనుగుబొమ్మలు ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి?
ఏనుగు బొమ్మను ఇంట్లో ఉత్తరం దిక్కున పెట్టాలి. దీంతో వాస్తు దోషాలు పోతాయి. ఇంటి సభ్యులు ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటి నుంచి బయట పడవచ్చు.
ఆఫీసులో వెండి ఏనుగు బొమ్మను పెట్టుకుంటే ఆఫీసులో వ్యాపారం లేదా ఉద్యోగం పరంగా ఉండే అన్ని సమస్యలు పోతాయట. వెండి లేకపోతే చిన్న పాలరాతి బొమ్మలు పెట్టుకోవచ్చు.
ఇంట్లో దేవుడి గదిలో వెండి ఏనుగు బొమ్మను పెడితే ఆర్థిక సమస్యలు పోతాయి. ఐశ్వర్యవంతులు అవుతారట.
రెండు ఏనుగు బొమ్మలను తెచ్చి పెట్టుకుంటే మరింత శుభకరంగా పెద్దలు చెబుతున్నారు.