కపిలతీర్థంలో ఆగస్టు 23న గోకులాష్టమి వేడుకలు


తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీవేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 23వ తేదీ గోకులాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు.





ఇందులో భాగంగా ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి వీధి ఉత్సవం, రాత్రి 8.00 నుండి 8.30 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.





సెప్టెంబరు 2వ తేదీ శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి





శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబరు 2వ తేదీ వినాయక చవితి ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.





ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ వినాయకస్వామివారు మూషికవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.