కృష్ణాష్టమి 2019: కష్టాలను, భయాలను తొలగించే కృష్ణాష్టకం


కృష్ణ అనే రెండు అక్షరాలు ప్రణవమంత్రం మొదలైన పవిత్ర మంత్రాలన్నింటితో సమానమైనవి. సర్వ భయాలను, కష్టాలను, సర్వ విఘ్నాలను తొలగించి విజయ పథంలో నడిపించే అద్భుత చైతన్యం కృష్ణనామం. సచ్చితానంద స్వరూపమైన కృష్ణ శబ్దం పరబ్రహ్మమై అలరారుతుంది. సత్యం, ఆనందం, నిరవధికానందం ఇవే కృష్ణనామానికి విస్తృత అర్థాలు. ఈ నెల 23న కృష్ణాష్టమి పర్వదినం జరుపుకోబోతున్నాం. ఈ రోజున కృష్ణాష్టకం వింటే చాలు. ఆ జగన్నాధుని దయ మనకు సంపూర్ణంగా లభిస్తుంది.





వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ |
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ||





అతసీపుష్పసంకాశం హారనూపురశోభితమ్ |
రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ||





కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననమ్ |
విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుమ్ ||






https://www.youtube.com/watch?v=ojbNgX6XZno




మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |
బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ||





ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభమ్ |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ||





రుక్మిణీకేళిసంయుక్తం పీతాంబరసుశోభితమ్ |
అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్ ||





గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసమ్ |
శ్రీ నికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ||





శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితమ్ |
శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ||





కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి ||