వైభవంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం, ఉత్తరద్వార దర్శనాలకు పోటెత్తిన భక్తజనం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏకాదశి నాడు అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 7.30 గంటల నుండి సర్వదర్శనం భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఉదయం 10.30 గంటల నుండి 11.30 గంటల వరకు నాలుగు మాడ వీధులలో ఉత్సవర్లును ఊరేగించారు. విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. రాత్రి 9.45 గంటలకు ఏకాంత సేవను నిర్వహించారు.

వైకుంఠ ద్వాదశిన చక్రస్నానం


డిసెంబరు 19వ తేదీ ద్వాదశి నాడు ఉదయం 3.00 గంటలకు సుప్రభాతంతో అమ్మవారి మేల్కొలుపు, ఉదయం 7.00 గంటల నుండి 9 గంటల వరకు పంచమీ తీర్థంలో చక్రతాళ్వార్లకు తిరుమంజనం నిర్వహించి చక్రస్నానం నిర్వహించారు.

అప్పలాయగుంటలో …


వైకుంఠ ఏకాదశి సందర్భంగా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వేకువజామున 3.30 నుండి 4.00 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉ. 4.00 నుండి 5.00 గంటల వరకు మూలవర్లకు తోమాల, కొలువు, అర్చన, విశేష నివేదన చేశారు. ఉదయం 5.00 నుండి 6.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరిగింది. ఉదయం 5.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమంచారు. భక్తులు విశేషంగా విచ్చేసి శ్రీపసన్న వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్లు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది.

19న ద్వాదశి

డిసెంబర్ 19న ద్వాదశి సందర్భంగా ఉదయం 4.30 గంటలకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొొలిపి ఉ.8.00 గంటల నుండి 9.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఉ.9 గంటల నుండి 10 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వ. అనంతరం ఉదయం 10.00 గంటలకు చక్రస్నానం నిర్వహించనున్నారు.

నారాయణవనంలో …


నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేకువజామున 5 నుండి 6 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.00 గంటల వరకు శ్రీవారి గ్రామోత్సవం, ఆస్థానం నిర్వహించారు.

నాగలాపురంలో …


నాగలాపురంలోని శ్రీ వేద నారాయణస్వామివారి ఆలయంలో డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని వేకువజామున 3.00 నుండి 4.30 గంటల వరకు తిరుపాల్లచ్చితో స్వామివారిని మేల్కొలిపి, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 5.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పించారు. ఉదయం 9.00 గంటలకు ఉత్సవర్లకు అభిషేకం, సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు.

అదేవిధంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామాలయం, చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, పిఠాపురంలోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం, వాల్మీకిపురంలోని శ్రీపట్టాభిరామ స్వామి ఆలయం, కోసువారిపల్లిలోని శ్రీప్రసన్న వేంకటరమణ స్వామి ఆలయం, కాకినాడలోని పురాణ ప్రసిద్ధి చెందిన శ్రీ భావన్నారాయణస్వామి ఆలయం, బెంగుళూరులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

Source