అప్పలాయగుంట లో వైకుంఠ ఏకాదశికి విస్తృత‌ ఏర్పాట్లు-టిటిడి

టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి, 19న ద్వాదశి పర్వదినాలకు విస్తృత‌ ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి వెల్లడించింది.

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులకు డిసెంబరు 18, 19న వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. ఈ రెండు రోజుల్లో విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేస్తామన్నారు. చలువపందిళ్లు, క్యూలైన్లతోపాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుత్‌ దీపాలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపడతారు. భక్తులకు టిటిడి ఇచ్చిన సూచనలు, మార్గాలను దృష్టిలో ఉంచుకుని స్వామివారి దర్శనం చేసుకోవాలి.

వైకుంఠఏకాదశి విశిష్టత


ఆలయ ప్రధానార్చకులు శ్రీ సూర్యకుమార్‌ ఆచార్యులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశికి మోక్షద ఏకాదశి అనే పేరు కూడా ఉందన్నారు. త్రేతాయుగంలో రావణుని నుండి కాపాడవలసిందిగా శ్రీ మహా విష్ణువును ముక్కోటి దేవతలు ప్రార్ధించగా, ఉత్తర దిశగా స్వామివారు ప్రత్యక్షమై శ్రీరామ అవతారంలో జన్మించి దేవతలకు అభయం కల్పించారు.

ఇందులో భాగంగా డిసెంబరు 18వ తేదీ ఉదయం 5.00 గంటల నుండి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. అనంతరం ఉదయం 8.00 గంటలకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. అదేవిధంగా ద్వాదశినాడు ఉదయం 10.00 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తామన్నారు.

Source