తిరుప్పావైలో ఏడవ పాశురం
కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్డా వుందన్నై
ప్పాడిప్పఱై కొణ్ణు యామ్ పెరు శమ్మానమ్
నాడుపుకళుమ్ పరిశినాల్ నన్డాక
శూడగమే తోళ్ వళై యేతోడేశేవిప్పూ
యామిణిహొమ్ పాడగమే యేన్ఱనైయ పల్ కలనుమ్
అడైయుడుప్పోమ్ అతన్ పిన్నే పాల్ శోఱు
మూడ, నెయ్ పెయ్ తు మళుంగైవళివారకూడి యిరుస్టు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.
అర్థము
నిన్ను ఆశ్రయింపని వారిని కూడా వారి మనసులను మార్చి నీకు దాసులౌనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడవై ఓ గోవిందా! నిన్ను సుత్తించి నీనుండి 'పఱ' అనే వాద్యాన్ని పొంది లోకులచే సన్మానింపబడలేనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంతా పొగడాలి. మేము పొందు ఆ సన్మానము లోకులందరూ పొగుడునట్లుండాలి. అనాటి మా రూపాలు ప్రకాశవంతంగా, తేజోమయంగా విరాజిల్లుతూ వుండాలి. దానికై మాకు కొన్ని భూషాణాలు కావాలి. ముంజేతులకు కంకణాలు కావాలి. భుజముల నాలంకరించుకొనుటకు భుజకీర్తులు కావాలి. దండలకు తోడవులును __ ఇంకా ఎన్నో అభూషణములను నీవనుగ్రహించగ మేము ధరించాలి. సన్మానమొందాలి. వీటన్నింటిని ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి. అటుపై క్షీరాన్నము మునుగునట్లు పోసిన నేయి మోచేతిగుండా కారుచుండగ మేమంతా నీతో కలసి చక్కగా అరిగించాలి. ఇదీ మా కోరిక . ఇట్లైన మా వ్రతము మంగలప్రదమైనట్లే!
స్వామిమొక్క ఆశ్రిత వ్యామోహాన్ని కీర్తించి వ్రతమును చేయటానికి కావలసిన పరికరాలన్నింటినీ అర్ధించారు గోపికలు . గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే! అంటే స్వామి తమతోనే వుండాలని ద్వానించేవిధంగా గోపికలు చాల చాతుర్యంతో వ్యవహరించారు. అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు. స్వామి యిదంతా విని 'మీరు చేసే వ్రతానికి ఫలాన్ని వివరించండి' అన్నారు గోపికలు యీ పాశురంలో ఆ ఫలాన్ని వివరిస్తున్నారు.
ఎనిమిదవ రోజు పాశురం
కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱు వీడు
మేయ్ వాన్ పరన్దనకాణ్! మిక్కుళ్ళపిళ్ళైగళుమ్
పోవాన్ పొగిన్ఱారై ప్పోగామల్ కాత్తున్నై
కూవువాన్ వన్దు నిన్ఱోమ్; కోదుకల ముడైయ
పావాయ్! ఎళున్దిరాయ్, పాడిప్పఱై కొణ్డు
మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ
దేవాది దేవనైచ్చెన్ఱు నామ్ శేవిత్తాల్
ఆవా వెన్ఱారాయ్ న్దు అరుళేలో రెమ్బావాయ్.
అర్థము
తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లివారింది. గేదెలు మంచుమేత మేయటానికై విడువబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగనే అతని వద్దకు చేరవలెనని, అట్లు చేసిన అతడు చాల సంతోషించునని తలుస్తున్నారు. అందరును కలిసి గోష్ఠిగ పోవుటే మంచిదని యెంచి వారినందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలముగనే వున్నదికదా! మరింక ఆలస్యమెందుకు? లెమ్ము! ఆశ్వాసురరూపుడైన కేశిని, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి, మన నోమునకు కావలసిన 'పఱై' అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమటకు పోయిన అతడు 'అయ్యో! మీరు నాకంటే ముందుగనే వచ్చితిరే!' యని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును.
ఈ ఎనిమిదవ పాశురంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణురాలైన గోపిక తెల్లవారిపోయిననూ ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన వారందరితో కలిసి గోదాదేవి మేల్కొలుపుతున్నది. ఇది ఎనిమిదవ పాశురము.
తొామ్మిదవరోజు పాశురం
తూమణి మాడత్తుచ్చుట్రుమ్ విళక్కెరియ
ధూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
మామీర్! అవళై యెళుప్పీరో ఉన్ మగళ్ దాన్
ఊమైయో ? అన్రిచ్చెవిడో ? అనన్దలో
ఏ మప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ?
మామాయన్ మాధవన్ వైకున్దన్ ఎన్రెన్రు
నామమ్ పలవుమ్ నవిన్రేలో రెమ్బావాయ్
తాత్పర్యము
పరిశుద్ధములగు నవవిధమణులతో నిర్మించబదిన మేడలో సుఖ శయ్యపై చుట్టును దీపములు వెల్గుచుండగా అగరు ధూపము గుమగుమలాడుచుండగా నిద్రపోవుచున్న ఓ అత్త కూతురా ! మణికవాటపుగడియ తీయుము. ఓయత్తా! నీవైనను ఆమెను లేపుము- నీకుమార్తె మూగదా? లేక చెవిటిదా ? లేక జాడ్యముకలదా? లేక ఎవరైన కదలిన ఒప్పమని కావలియున్నారా? లేక గాఢ నిద్రపట్టునట్లు మంత్రించినారా?
"మహామాయావీ ! మాధవా! వైకుంఠవాసా!" అని అనేక నామము లను కీర్తించి ఆమె లేచునట్లు చేయుము.
ఈ సందర్బములో గోదాదేవి భగవంతునికీ భక్తునికి మధ్యా సంబంధమును వివరించినారు.
1. మనందరిని తండ్రి ఆయనే 2. మనందరిని రక్షించేవాడు ఆయనే 3. మనందరిని నామాలు అని కల్గిన వాడు ఆయనే- శేశి అంటారు 4. మనందరిని భరించేవాడు ఆయనే - భర్త అంటారు 5. మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సినవాడు ఆయనే- జ్ఞేయము అంటారు 6. మనందరిని తన వస్తువులుగా కల్గి ఉండి వాటికి స్వామి ఆయనే 7. మనందరికి ఆధారం ఆయనే - నారాయణుడు అంటారు 8. మనందరి లోపలుండే ఆత్మ ఆయనే - అంతర్యామి అంటారు 9. భోక్తా ఆయనే.
లోకంలో మనం ఏదో ఒక సంభందం అమ్మ,నాన్న, భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంభందం వల్ల ఎంత ప్రేమ కల్గి ఉంటాం, అదే ఇన్ని సంబంధాలు కల్గి, శాశ్వతంగా వీడని సంభందం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు! కుడా అదే ప్రేమ కల్గి వుంటుంది. ఈ విధముగా భగవద్ సంబందమును వివరించారు మన గోదామాత.
పదవ పాశురము
నోట్రుచ్చువర్కమ్ పుహిగిన్రవమ్మనాయ్
మాట్రముమ్ తారారో వాశల్ తిరవాదార్
నాట్రత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోట్రప్పరైత్తరుమ్ పుణ్ణియనాల్,పణ్ణొరునాళ్,
కూట్రత్తిన్ వాయ్ విళన్ద కుమ్బకరుణనుమ్
తోట్రు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో ?
ఆట్రవనన్దలుడై యా యరుంగలమే
తేట్రమాయ్ వన్దు తిరవేలో రెమ్బావాయ్
అర్థము
మేము రాక ముందు నోమునోచి..దాని ఫలముగా సుఖనుభావమును పోందినతల్లీ! తలుపుతెరవకపోయినా పోదువుగాక..ఒక మాటనైనను పలుకవా! పరిమళముతో నిండిన తులసిమాలలు అలంకరింఛిన కిరీటము గల నారాయణుడు..ఏమియులేని మావంటివారము మంగళము పాడినను `పర ' అను పురుషార్ధమును ఒసంగేటి పుణ్యముర్తి..ఒకనాడు కుంభకర్ణుని మృత్యువు నూతి లో పడత్రోయగా..ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడించబడి తనసొత్తగు ఈ గాఢ నిద్ర ను నీకు ఒసగినాడా! ఇంత అధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లీ ! మాకందరకు శిరోభుషణమైనదానా! నిద్రనుండి లేచి..మత్తును వదలించు కొని..తేరుకొని వచ్చి తలుపు తెరువు..నీ నోరు తెరచి మాటలాడు..కప్పుకొని ఉన్న దుప్పటిని తొలగించి ఆవరణములోకి వచ్చినీ దర్శనము మాకు కలిగించు..అని ఈ పాశురములో అంటున్నారు.