సకల భోగభాగ్యాలను ప్రసాదించే తిరుప్పావై వ్రతం డిసెంబరు 16 నుంచి ఆరంభమై జనవరి 14కు ముగుస్తుంది. ఈ సందర్భంగా తిరుప్పావై మొదటి ఆరు పాశురాలు తెలుగులో....
మార్‌గళితిఙ్గళ్ మదినిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్! పోదుమినో నేరిళైయీర్!
శీర్‌మల్ గుం ఆయ్‌ప్పాడి శెల్వచ్చిఱుమీర్ కాళ్!
కూర్‌వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్‌న్దకణ్ణి యశోదై యిళంశిఙ్గమ్
కార్‌మేని చ్చెఙ్గణ్ కదిర్ మది యయ్బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై తఱువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్.
అర్ధం
మార్గశిర మాసంలో మంచి వెన్నెల రోజు ఇది. శ్రీలు పొంగెడి వ్రేపల్లె పడుచులు, దివ్యాభరణాలను దాల్చిన మేల్బంతులూ ఇటు రండు. నందగోప సుతుడు, యశోద కిశోర సింహం, సూర్యచంద్రులను మించిన శ్యామ సుందరుడు అయిన ఆ నారాయణుడు మనకు పరనిచ్చువాడు. మనం చేస్తున్న ఈ శ్రీవ్రతం జగతికంతా మంగళము చేకూరుస్తుంది.
రెండవ పాశురం
వైయత్తు వాళ్‌వీర్‌గాళ్! నాముం నమ్పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో - పాఱ్కడలుళ్
పైయత్తు యిన్ఱ పరమనడిపాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాముడియోయ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళైచ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చెయుం ఆన్దనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగన్దేలో రెమ్బావాయ్
అర్థం
సఖులారా! నోము కోసం చేసే పనులేంటో వినండి. పాలసముద్రంలో పవళించి ఉన్న శ్రీహరి పదములను పాడి, సిరినోము కోసం తరలి రారండి. పాలు, నేయి తినము. వేకువనే నీరాడి కాటుకను తీర్చము. పూలను ముడువము. చేయరానివేవీ చేయము. చెడ్డ మాటలు మాట్లాడము. దాన ధర్మాలను చేస్తాము. మన ఈ శ్రీ వ్రతం జగతికే మంగళం చేకూరుస్తుంది.
మూడవ పాశురం
ఓంగియులగళన్ద వుత్తమన్ పేర్‌పాడి
నాఙ్గళ్ నమ్పావైక్కు చ్చాత్తి నీరాడినాల్
తీంగిన్ఱి నాడెల్లాం తిఙ్గళ్ ముమ్మారి పెయ్‌దు
ఓంగి పెరుఞ్శన్న లూడు కయలుగళ
పూంగువళై ప్పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేఙ్గాదే పుక్కిరిన్దు శీర్ త్త ములై పట్రి
వాఙ్గ కుడం నిఱైక్కుం వళ్ళల్ పెరుమ్పశుక్కల్
నీఙ్గాద శెల్వం నిఱైన్దేలో రెమ్బావాయ్.
అర్థం
లోకాలన్నీ కొలిచిన పురుషోత్తముని మేము కీర్తించగా దేశమంతా నెల మూడు వానలు కురిసి, ఈతి బాధలు తొలగుతాయి. పెరిగిన వరిచేలు, పూలపై మెరిసే తుమ్మెదలు, కామధేనువులు కలశాలను నింపుతాయి. నిత్య సంపదలతో అందరూ కళకళలాడుతూ ఉంటారు. మన శ్రీవ్రతం జగతికి మంగళం చేకూరుస్తుంది.
నాలుగవ పాశురం
ఆళిమళై క్కణ్ణా! ఒన్ఱునీకైకరవేల్
ఆళియుల్ పుక్కు ముగన్దుకొడు ఆర్తేఱి
ఊళి ముదల్వ నురువం బోల్ మెయ్‌కఱుత్తు
పాళియన్దోళుడైపఱ్పనాబన్‌కైయిల్
ఆళిపోల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిర్‌న్దు
తాళాదే శార్‌ఙ్గ ముదైత్త శరమళై పోల్
వాళ వులగినిల్ పేయ్‌దిడాయ్ నాఙ్గళుమ్
మార్‌గళి నీరాడ మగిళ్‌న్దేలో రెమ్బావాయ్.
అర్థం
పర్జన్య దేవా! పాలింపుము. సముద్రంలోని నీటిని తాగి ఆకాశం పైకెక్కి గర్జించుము. సుందరమైన బాహువులుగల అరవిందనాభుడి హస్తంలో చక్రం లాగా మెరిసి, శంఖం లాగా ఉరిమి, శార్‌ఙ్గం లాగా శర పరంపరగా వర్షాన్ని కురిపించుము. మేము మార్గశిర స్నానం చేసి తరిస్తాము. మన శ్రీవ్రతం జగతికే మంగళాన్ని చేకూరుస్తుంది.
ఐదవ పాశురం
మాయనై మన్ను వడమదురై మైన్దనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్ఱుమ్ మణివిళక్కై
తాయై క్కు డల్విళక్కం, శెయ్‌ద దామోదరనై
తూయోమాయ్ వన్దునాం తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిన్దిక్క
పోయపిళై యుం పుగుతరువా నిన్ఱనవుమ్
తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్.
అర్థం
మన హరి ఒక మాయావి. స్వచ్ఛమైన యమునా తీరంలో విహరించేవాడు. గోపాల వంశంలో వెలిగే మణిదీపం. తల్లి కడుపునకు చల్లని వెలుగైన ఆ దామోదరుని దగ్గరికి పరిశుద్ధులమై వెళ్లి, పూలు చల్లి, నోరార కీర్తించుదాము. మనసార ధ్యానిద్దాం. హరినామం వల్ల మన పాపాలన్నీ నిప్పులో పడిపోవును. మన శ్రీ వ్రతం జగతికే మంగళాన్ని చేకూరుస్తుంది.
ఆరవ పాశురం
పుళ్ళుం శిలుమ్బినగాణ్ పుళ్ళరైయిన్ కోయిలిల్
వళ్లై విళిశంగిన్‌పేరరవం కేట్టిలైయో?
పిళ్ళాయ్ ఎళున్దిరాయ్ పేయ్ ములైనన్జుణ్డు
కళ్లచ్చగడం కలక్కళియాక్కాలోచ్ఛి
వెళ్ళత్తరవిల్ తుయిలమర్‌న్ద విత్తినై
ఉళ్ళత్తుక్కొణ్డు మునివర్ గళుం యోగిగళుమ్
మెళ్ళ వెళున్దు అరియెన్ఱ పేరరవమ్
ఉళ్ళం పుగున్దు కుళిర్‌న్దేలో రెమ్బావాయ్.
అర్థం
పక్షులు కూస్తున్నాయి. బాలా.. మేలుకోవే! పూతన స్తనాల లోని విషాన్ని పీల్చి, మాయా శకటాన్ని కూల్చి, పాలసముద్రంలో యోగనిద్రలో ఉన్న విష్ణువును మునులు, యోగులు మనసులో ధ్యానిస్తూ హరిహరీ అని పాడుతున్నారు. మన హృదయాలు ఆహ్లాదంతో తేలియాడుతున్నాయి. మన శ్రీ వ్రతం జగతికే మంగళాన్ని చేకూరుస్తుంది.