శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు పుష్పక విమానం ఊరేగింపు వైభవంగా జరిగింది. వేంకటాద్రీశుడు పుష్పక విమానంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చాడు. ఈ విమానాన్ని అలంకరించడానికి ఒక టన్ను వివిధ రకాల పుష్పాలను వినియోగించారు.
ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత కోలాట కృష్ణుడు భక్తులకు అభయమిచ్చారు. అంసంఖ్యాక భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ వెంట నడిచారు. కోలాట కృష్ణునిగా దర్శనమిచ్చిన ఆ మలయప్పస్వామిని కన్నులారా తిలకించి భక్తులు ఆనందపరవశులయ్యారు.
Source