శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఉదయం బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ జరిగింది.
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం దర్శనం, బస, అన్నప్రసాదాలు సక్రమంగా అందేలా టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. బ్రహ్మోత్సవ శోభ ఉట్టిపడేలా విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టింది.
వాహన సేవల ఎదుట సాంస్కృతిక ప్రదర్శనలతోపాటు మాడ వీధుల్లోని పలు వేదికలపై నామసంకీర్తన, నాదనీరాజనం, ఆస్థానమండపం వేదికలపై ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.
Source