కన్నులపండువగా రథరంగ డోలోత్సవం, స్వర్ణరథంపై కాంతులీనిన స్వామి

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన మంగళవారం సాయంత్రం 4.00 నుండి 6.00 గంటల వరకు రథరంగ డోలోత్సవం కన్నులపండుగగా జరుగింది. శ్రీనివాసుడు ధగధగా మెరిసిపోతున్న స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించాడు.

స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. స్వర్ణమయమైన రథంలో శ్రీభూదేవేరులతో మలయప్ప దర్శనమిచ్చాడు. ఇతర వాహనాల ముందు సాగే బ్రహ్మశూన్యరథం, గజ, అశ్వ, వృషభాదుల సంరంభం ఈ స్వర్ణ రథోత్సవంలో కూడా ఉంటుంది.

Source