తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఘనంగా పుష్పాంజలి

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 201వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు సమన్వయాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి ఆదివారం ఘనంగా పుష్పాంజలి సమర్పించారు.

ఈ సందర్భంగా ఆచార్య కె.జె.కృష్ణమూర్తి మాట్లాడుతూ శ్రీవారి ఆపర భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తిరుమలలో మొదటగా అన్నప్రసాద వితరణను ప్రారంభించారని చెప్పారు. వెంగమాంబ శ్రీవారి ఆలయంలో ప్రవేశపెట్టిన ముత్యాలహారతి నేటికీ కొనసాగుతోందని ఆయన వివరించారు.

తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జయంతి, వర్ధంతి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ భక్తితత్వాన్ని వ్యాప్తి చేస్తున్నట్టు తెలిపారు.

Source