బాలాలయం కార్యక్రమాలు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం సాయంత్రం మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.
బాలాలయం కార్యక్రమాల సందర్భంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి సన్నిధి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయం, శ్రీప్రసన్న ఆంజనేయస్వామివారి ఆలయాలలో జీర్ణోద్ధరణ పనులు , గరుడాళ్వారు, ఆళ్వార్లు, ధ్వజస్తంభం వద్ద మరమత్తులు చేపడుతున్నారు. ఇందుకోసం ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు నిర్వహిస్తారు.
బాలాలయం కార్యక్రమాలలో భాగంగా ఆగస్టు 5న ఉదయం వాస్తుశుద్ధి, జలాధివాస శుద్ధి చేస్తారు. సాయంత్రం మహాశాంతి జాప్యం, మహాశాంతి తిరుమంజనం, రక్షాబంధనం, శయనాధివాసం, సర్వదేవతార్చన నిర్వహిస్తారు. ఆగస్టు 6న ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, కుంభ బింబ ప్రదక్షిణ, ఉదయం 9.50 నుండి 10.30 గంటల మధ్య కన్యా లగ్నంలో బాలాలయ కుంభాబిషేకం నిర్వహిస్తారు. ఆ తరువాత అక్షతారోపణ, బ్రహ్మ ఘోష చేపట్టనున్నారు. అనంతరం భక్తులను ఉదయం 11.00 గంటల నుండి భక్తులకు బాలాలయంలో స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
Source