వరలక్ష్మీవ్రతం నిర్వహణకు టిటిడి విస్తృత ఏర్పాట్లు


సిరులతల్లి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 24న నిర్వహించనున్న వరలక్ష్మీవ్రతం నిర్వహణకు టిటిడి  సన్నాహాలు చేస్తోంది.  భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లుచేపడుతోంది.

వరలక్ష్మీ వ్రతం కు సంబంధించిన 200 టికెట్లను ఆగస్టు 23వ తేదీనఆలయం వద్ద గల కౌంటర్‌లో విక్రయిస్తారు. వరలక్ష్మీ వ్రతం భక్తులు తిలకించేందుకు వీలుగా ఆస్థానమండపంలో, రథమండపం వద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేయనున్నారు. అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, ఇతర ప్రాంతాల్లో ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ లు ఏర్పాటు చేస్తున్నారు. కంకణాలు, కుంకుమ ప్యాకెట్లు, కరపత్రాలను , భజన బృందాలు తదితర ఏర్పాట్లు విస్తృతంగా చేపడుతున్నారు.

పురాణ ప్రశస్త్యం

పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, అచరించవలసిన విధానాన్ని తెలియచేసినట్లు స్కంద, భవిష్యోత్తర పురాణాల ద్వారా తెలుస్తోంది. కావున సాక్షాత్తూశ్రీ మహాలక్ష్మీ అవతరించిన దివ్యస్థలం తిరుచానూరు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ఆనవాయితీ. శ్రావణ మాసంలో ఈ వ్రతం చేసిన మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబసౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాలు తెలియచేస్తున్నాయి.

వరలక్ష్మీ వ్రతం పోస్టర్లు ఆవిష్కరణ

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 24న నిర్వహించనున్న వరలక్ష్మీవ్రతం పోస్టర్లను ఆవిష్కరించారు.  ఆగస్టు 24వ తేదీ శుక్రవారం ఉదయం 10.00 నుంచి 12.00 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీవ్రతంను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 6.00 గంటలకు స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు నాలుగుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.  వరలక్ష్మీ వ్రతంలో భక్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పాల్గానవచ్చు. ఈ కారణంగా అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఊంజల్‌సేవలను టిటిడి రద్దు చేసింది.

Source