ఆగస్టు 21వ తేదీ మంగళవారం సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు అమ్మవారికి అభిషేకం, రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు కంకణ ధారణ నిర్వహించనున్నారు. ఆగస్టు 28వ తేదీ ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు అభిషేకం, సెప్టెంబరు 4వ తేదీన ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
సెప్టెంబరు 5వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు సముదాయం గ్రామంలో ఊరేరగింపు, సెప్టెంబరు 6వ తేదీ సాయత్రం 6.00 గంటల వరకు కీలాగారం గ్రామాలలో శ్రీ ఆమ్నాయాక్షి అమ్మవారు ఊరేగి గ్రామస్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. సెప్టెంబరు 7వ తేదీ సాయంత్రం 5.00 గంటల నుండి నారాయణవనం, సముదాయం, కీలాగారం గ్రామాలలో అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఆలయ ప్రాశస్త్యం
ఆమ్నాయాక్షి అనగా వేదాలే కళ్లుగా గల అమ్మవారు అని అర్థం. ఈ ఆలయంలోని అమ్మవారిని చతుర్ముఖ బ్రహ్మ ప్రతిష్ఠించినట్టు ఐతిహ్యం. నారాయణవనం ఆలయాన్ని 1967, ఏప్రిల్ 9న టిటిడి తన ఆధీనంలోకి తీసుకుంది. దీంతో పాటు పురాతన ఆమ్నాయాక్షి అమ్మవారి ఆలయం కూడా టిటిడి పరిధిలోకి వచ్చింది. నారాయణవనాన్ని పాలించిన శ్రీపద్మావతి అమ్మవారి తండ్రి అయిన ఆకాశరాజు వంశస్థులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.
Source