చంద్రగ్రహణం కారణంగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తిరుమల ఆలయం తలుపులు మూసివేశారు. శుక్రవారం రాత్రి 11.54 గంటల నుండి శనివారం ఉదయం 3.49 గంటల వరకు చంద్రగ్రహణం సంభవించిన విషయం తెలిసిందే. ఆలయ నియమాలననుసరించి గ్రహనం సంభవించడానికి ఆరుగంటల ముందు నుంచే ఆలయం మూసివేస్తారు.
తిరిగి శనివారం తెల్లవారుజామున 4.15 గంటలకు తిరుమల ఆలయం తలుపులు తెరిచారు. శుద్ధి, పుణ్యహవచనం తదితర కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ప్రతి నిత్యం నిర్వహించాల్సిన సుప్రభాత సేవా కార్యక్రమాలు జరిగాయి.
అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. గ్రహణం కారణంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచీ నిలిపివేసిన అన్నప్రసాద వితరణ తిరిగి ప్రారంభమైంది.