భారతదేశ కాలమాన ప్రకారం సంపూర్ణ చంద్ర గ్రహణ సమయములు
- చంద్ర గ్రహణ స్పర్శ : రాత్రి 11 గంటలు 54 నిమిషాలు
- సంపూర్ణ స్థితికి గ్రహణం రాక : రాత్రి 01గంటలు 00 నిమిషాలు
- చంద్ర గ్రహణ మధ్యకాలం : రాత్రి 01గంటలు 52 నిమిషాలు
- సంపూర్ణ స్థితి నుండి విడుపు ప్రారంభం : రాత్రి 02 గంటలు 43 నిమిషాలు
- చంద్ర గ్రహణ ముగింపు (మోక్షకాలం) : రాత్రి 03 గంటలు 49 నిమిషాలు
- అద్యంత పుణ్యకాలం : 3 గంటల 55 నిమిషాలు ( మొత్తం 235 నిమిషాలు )
భారత కాలమానానికి చూస్తే నిద్రించే సమయంలో ఉన్నది కనుక ఎక్కువ శాతం నిద్రలో ఉంటారు కాబట్టి చూడడానికి ఆసక్తి చూపరు. ఈ గ్రహణం భారతదేశంతో పాటు దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండములలో కనపడుతుంది.
సంపూర్ణ చంద్ర గ్రహణం గా ఏర్పడబోతున్న ఈ గ్రహణం ఉత్తరాషాఢ,శ్రవణా నక్షత్రాలపై ప్రభావం చూపుతుంది. జూలై 27రాత్రి 11.54 లకు మొదలయ్యే ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం మరుసటి రోజు (శనివారం) తెల్లవారు ఝామున 3.49లకు విడుస్తుంది. 3.54 గంటల పాటు వుండే సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఇది. పైగా కేతు గ్రస్తమైన గ్రహణం అని నిపుణులు చెబుతున్నారు.
సంపూర్ణ చంద్ర గ్రహణ దోష నివారణ కు చేయాల్సిన పనులు
- రాత్రి 11.54 లకు పట్టు స్నానం,తెల్లవారు ఝామున 3.49లకు విడుపు స్నానం చేయాలి.
- గ్రహణం పట్టి విడిపోయే మధ్య కాలంలో మంత్రానుష్టానం చేసుకోవాలి.
- మంత్రానుష్టానం లేనివాళ్లు విష్ణు సహస్ర నామం,లలితా సహస్ర నామం పారాయణ చేయాలి.
- గ్రహణ సమయంలో చేసే దానం విశేష పుణ్యాన్ని కలగజేస్తుంది, శక్తి గలవారు కురుక్షేత్రం వెళ్లి దానం చేయవచ్చు, లేదా ఎవరి ఇంటి దగ్గర వారు దానం చేసుకోవచ్చు.
- ఉత్తరాషాఢ,శ్రవణా నక్షత్రాలపై గ్రహణ ప్రభావం పడుతున్నందున, ఈ నక్షత్రాల వారు గ్రహణం పట్టే సమయంలో కంచు పాత్రలో నెయ్యివేసి, అందులో బంగారు సర్పం,వెండి చంద్రుడి ప్రతిమలు ఉంచి పూజించి, గ్రహణం విడిపోయాక, సూర్యోదయం తర్వాత పురోహితునికి దానం చేస్తే గ్రహణదోషం పరిహారమవుతుంది.
- దానం చేయలేని పక్షంలో శనివారం ఉదయం మహాన్యాస ఏకాదశ రుద్రభిషేకం చేయించు కోవచ్చు.
- ఆరోజు కుదరకపోయినా 11రోజుల్లోగా ఈ అభిషేకం చేయించుకోవచ్చు.
- కెజింపావు బియ్యం,కెజింపావు ఉలవలు,తెల్లని వస్త్రం, రంగుల రంగుల వస్త్రం కలిపి దానం చేసినా మంచిదే.
- ముఖ్యంగా గర్భవతులు ఎలాంటి భయందోళన పడవలసిన అవసరం లేదు.లేని పోని అనుమానలు పడవద్దు,అను మానాలు చెప్పే వారి మాటలను నమ్మవద్ధు. గర్భవతులు ఎవరైన రాత్రి గ్రహణ సమయానికి మేలుకుని ఉంటే ప్రత్యక్షంగా చూడ కూడదు,కాని టివిలలో చూడవచ్చు.మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మీకు మరీ మంచిది. గ్రహణ సమయంలో కదలకూడదు,మల,మూత్ర విసర్జన చేయకూడదు అనే అపోహలకు బయపడకండి.మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రహణ సమయంలో కాలక్రుత్యాలు చేసుకోవచ్చును.
- గ్రహణ సమయానికి కనీసం 3 మూడు గంటల ముందుగా ప్రతి ఒక్కరు ఆహారం స్వీకరించినచో, గ్రహణ ప్రారంభ సమయానికి తిన్న ఆహారం జీర్ణమగును.
- గ్రహణ పట్టు ,మధ్య , విడుపుస్నానాలు ఆచరించే వారు యాధావిధిగా స్నానం ఆచరించి,మంత్రానుష్టానములను నిర్వహించుకొవచ్చును.
- గ్రహణం మరుసటి రోజు అనగా శనివారం నాడు ఇల్లు శుభ్రంగా తుడుచుకుని. స్నానం చేసే నీళ్ళలో చిటికెడు పసుపు, రెండు హారతి కర్పూరం బిళ్ళలను చూర్ణం చేసుకుని నీళ్ళలో వేసుకుని తప్పక అందరూ తల స్నానం చేసుకోవాలి.
- ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజాగదిని శుభ్రపరచుకుని గాయత్రి ( జంజ్యం ) ని మార్చుకుని, దేవత విగ్రహాలను,యంత్రాలను "పులికాపి" చేయాలి. శుద్ధమైన నీళ్ళలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు,యంత్రాలు ప్రోక్షణ చేసి దీపారాధన అలంకరణం చేసి మహా నైవేద్యం కొరకు బెల్లంతో చేసిన మరమాన్నం వండి దేవునికి నివేదన చేయాలి.
- ఇంట్లో పూజ అయిన తర్వాతనే గుడికి,దైవ దర్శనాలకు వెళ్ళే వారు వెళ్ల వచ్చును.
- మకరరాశి వారు తగు గ్రహాణ దోష పరిహార ప్రక్రియలను మీకు అనుకూలమైన పండితులను సంప్రదించి దోష పరిహార జప,దానాదులను చేసుకోవాలి.
- ద్వాదశ రాశుల వారు గోమాతకు బియ్యం,తోటకూర,బెల్లం కలిపి ఆవునకు తినిపించాలి.గోమాత మనం పెట్టిన దాన్యం తినేప్పుడు మూడు ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి.
- నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయలను గుమ్మంపై నుండి తీసివేసి మళ్లి కొత్త వాటిని అనుభవజ్ఞులైన పండితులచే పూజించి ఇంటికి,వ్యాపార సంస్థలకు కట్టుకోవాలి.
- గ్రహణం తర్వాత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి,కొబ్బరి కాయలు శక్తి కోల్పోతాయి. నరదృష్టికి నాపరాయి కూడా పగులుతుంది. కాబట్టి తిరిగి మనకు,మన కుంటుబ సభ్యుల కొరకు ,ఇంటికి,వ్యాపార సంస్థల రక్షణ కొరకు తప్పక కట్టుకోవాలి. రోజూ అగర్బత్తి, దూపం మొదలగునవి తప్పక చూపించాలి.
- ఇవేవీ చేయడం కుదరని పక్షంలో ఆరు మాసాలపాటు శివ కవచం పఠిస్తే మంచిదని కూడా అంటున్నారు.
గ్రహాల ప్రభావం మనసుపై పడుతుందని అందుకే గ్రహణ ప్రభావం గల నక్షత్రాల వారు నివారణకు తగిన మార్గాలు అనుసరించడం శ్రేయోదాయకమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని పెద్దల సూచన.