జూన్‌ 28 నుండి జూలై 1వ తేదీ వరకు కురుక్షేత్రలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మహా కుంభాభిషేకం

హర్యానా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రలో టిటిడి నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్‌ 28 నుండి జూలై 1వ తేదీ వరకు మహాకుంభాభిషేకం మరియు నూతన విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. బ్రహ్మ సరోవరం సమీపంలోని ఈ ఆలయంలో జూన్‌ 28వ తేదీ గురువారం సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, వాస్తు హోమం, అంకురార్పణం జరిగింది.

ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్‌ 29వ తేదీ ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు చతుష్ఠానార్చన, దేవతా ప్రతిష్ఠ, యాగశాలలో వైధిక కార్యక్రమాలు, సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు నిత్యహోమం, నూతన విగ్రహలకు క్షీరాధివాసము నిర్వహించనున్నారు. జూన్‌ 30వ తేదీ ఉదయం చక్రగ్న మండ్ల ఆరాధన, విశేష హోమాలు, జలాధివాసము, సాయంత్రం భగవతారాధన, నిత్యహోమాలు, పంచశయ్యాదివాసము జరుగనుంది.

జూలై 1వ తేదీ తెల్లవారుఝామున 3.00 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు ధ్వజస్థంభప్రతిష్ఠ, శ్రీవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ (దృవమూర్తి ప్రతిష్ఠ), ప్రాణప్రతిష్ఠ, మహాకుంభ సంప్రోక్షణ అత్యంత వైభవంగా నిర్వహించి, అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు శాంతి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.

Source