సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ”అష్టబంధన మహాసంప్రోక్షణ” కార్యక్రమం ఆదివారం ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు మహాసంప్రోక్షణతో ఘనంగా ముగిసింది.
ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం ప్రక్కన గల గంగుండ్ర మండపంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఉదయం 7.00 నుండి 7.30 గంటల వరకు పుణ్యాహవచనం, మహాపూర్ణాహుతి, వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఉదయం 9.00 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
అనంతరం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తిరుచానూరులో ఇటీవల పున:ప్రతిష్టచేసిన శ్రీశ్రీనివాస ఆలయంను ోస్వామివారిని దర్శించుకుని, పూజలు నిర్వహించారు.
కాగా సాయంత్రం 5.30 గంటలకు స్వామివారు అశ్వవాహనంపై తిరు మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
Source