ఈ సందర్భంగా ఆచార్య కె.జె.కృష్ణమూర్తి ‘ఉషాకళ్యాణం’ పై శ్రీ తాళ్లపాక చిన్నన్న రాసిన సాహిత్యాన్ని సోదాహరణంగా వివరించారు. యావత్ భక్తి సాహిత్యంలో అన్నమయ్యకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు.

అనంతరం తిరుపతికి చెందిన శ్రీ ఎం. వెంకటాచలపతి ‘అన్నమయ్య – రామదాసు తులనాత్మక పరిశీలన’ అనే అంశంపై ఉపన్యసించారు. అన్నమయ్య- రామదాసు జీవిత విశేషాలను పరిశీలిస్తే కొన్ని సాదృశ్యాలు, వ్యత్యాసాలు కనిపిస్తాయన్నారు. ఇద్దరు తెలుగునాట భాగవత శిఖామణులుగా, భాగవతోత్తములుగా గుర్తింపు పొందారని వివరించారు. ఇద్దరి కీర్తనలలో సామాన్య ప్రజలను చైతన్యవంతం చేసేలా, భక్తిభావాన్ని పెంచేలా ఉన్నాయన్నారు.
తిరుపతికి చెందిన డా. బి. శ్రీరాములు ‘ అన్నమయ్య సంకీర్తనల్లో సందేశం’ అనే అంశంపై ఉపన్యసిస్తూ అన్నమయ్య సంకీర్తనలలో పద సాహిత్యాన్ని సృష్టించడంలో ఒక ప్రత్యేకతను సాధించినట్టు తెలిపారు. శ్రీవారి మీద వేలాది కీర్తనలు రచించినా, భావంలో ఎక్కడా పునరుక్తి లేదని, అన్నీ కొత్తగానే ఉంటాయని అన్నారు.
సాయంత్రం 6 నుండి నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Source