వైభవంగా వైశాఖ పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో ఆదివారంనాడు రాత్రి 7 గంటలకు వైశాఖ పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. స్వామివారు తన ఇష్టవాహనమైన గరుత్మంతునిపై సువర్ణకాంతులతో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.

garudaseva

ఈ సంవత్సరంలో మొదటిసారి పౌర్ణమి గరుడసేవ కావడం, చిత్రా పౌర్ణమి కావడంతో భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమాడ వీధులు గోవిందనామ స్మరణతో మార్మోగాయి. ధర్మప్రచారపరిషత్‌ మరియు అన్నమాచార్యప్రాజెక్టు కళాకారులతో నాలుగుమాడ వీధులలో భజనలు, కోలాటాలు, చెక్క భజనలు కోలాహాలంగా నిర్వహించారు.

Source