రెండు వత్తుల దీపాలను వెలిగించడం వల్ల కలిగే లాభాలు

రెండు వత్తుల దీపాన్ని బ్రహ్మస్వరూపంగా, దేవి రూపంగా భావిస్తారు. ప్రతీరోజు దీపపు కుందెలో రెండు వత్తులు వేసి దీపారాధన చేస్తే మనసు నిర్మలంగా ఉంటుంది. మనం వెలిగించిన దీపం లాగానే ప్రకాశవంతంగా ఉంటుంది. ప్రతీరోజు, ఉదయం సూర్యోదయకాలంలో అలాగే సూర్యాస్తమయ సమయంలో రెండువతత్తులతో దీపారాధన చేస్తే అన్నివిధాలా శుభం కలుగుతుందని పూర్వీకులు చెబుతున్నారు. ఇంట్లో కానీ ఆలయంలో కానీ రెండు వత్తుల దీపం వెలిగిస్తే లభించే ఫలితాలను తెలుసుకుందాం.

రెండు వత్తులతో దీపారాధన చేసేవారు మంచి తేజస్సును కలిగి ఉంటారు. ముఖంలో ఏదో తేలీని కాంతి ఇతరులను ఆకర్షిస్తుంది. ఇతరులచే ప్రేమింపబడతారు. అంతేకాకుండా మనలో దైవభక్తి పెంపొందుతుంది.

చంచలమైన మనస్సు ఉన్నవారు రెండు వత్తులతో దీపారాధన చేస్తే మనసు నిలకడగా మారుతుంది. గృహంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లేనికారణంగా ఏర్పడే మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. రెండు వత్తులతో దీపం వెలిగిస్తే కుటుంబంలో భార్యాభర్తల మధ్యన, ఇతర కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులు, సమాజంలోని ఇతర స్నేహితులు శ్రేయోభిలాషుల మధ్యన స్నేహభావం పెరుగుతుంది.

ఇంట్లో పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం బాగుండాలని కోరుతూ భగవంతునికి రెండు వత్తులతో దీపం వెలిగిస్తే మంచి ఫలితం దక్కుతుంది. గర్భిణులు రెండు వత్తుల దీపాన్ని వెలిగిస్తే సుఖప్రసవం జరుగుతుంది.
విద్యార్ధులు, ఉద్యోగం చేసేవారిలో ఏకాగ్రత పెరిగి చదివే చదువులో, చేస్తున్న ఉద్యోగంలో విజయాలు సంప్రాప్తిస్తాయి.
దివ్వమైన ఫలితాలు లభిస్తాయి.

గురువారం, శుక్రవారం ఉదయం 5 గంటల నుండి 6 గంటలలోగా వెలిగింస్తే ఐశ్వర్యం వృద్ధిచెందుతుంది. శివాలయాల్లో ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేసే ముందు రెండువత్తుల దీపంతో దీపారాధన చేయాలి. దీపారాధన సమయంలో శివపంచాక్షరీ మంత్రం పఠిస్తే ఆయురారోగ్యాలు, జ్ఞాన సంపత్తి లభిస్తాయి.

గురుపౌర్ణమి నాడు లేదా దత్తజయంతి నాడు భ్రహ్మీముహూర్త సమయంలో రెండు వత్తులతో దీపారాధన చేస్తే మనం చేసే ప్రతి సంకల్పానికి గురుబలం తోడవుతుంది.

వ్యాపారస్తులు తమ వ్యాపారాభివృద్ధికోసం ప్రతి పౌర్ణమి తిథి నాడు రెండువత్తులతో దీపరాధన చేస్తే వ్యాపారాభివృద్ధి లభిస్తుంది. అదేవిధంగా మానసికంగా నిలకడ లేనివారికి మనఃస్థిమితం లభిస్తుంది.