తాళ్లపాక అన్నమయ్య 610వ జయంతి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 610వ జయంతి ఉత్సవాలు ఏప్రిల్ 29 నుండి మే 5వ తేదీ వరకు టిటిడి  నిర్వహిస్తోంది. అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరంలో ఈ  ఉత్సవాలు నిర్వహించనున్నారు.  ఈ మేరకు జయంతి ఉత్సవాల పోస్టర్లను టిటిడి తిరుపతి జెఈఓ ఆవిష్కరించారు.

jayanti poster

తాళ్లపాకలో..


కడప జిల్లా తాళ్లపాకలోని ధ్యానమందిరంలో ఏప్రిల్ 29వ తేదీన ఉదయం సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు. మే 1న శ్రీవారి కల్యాణం వైభవంగా జరుగనుంది. ఏప్రిల్ 29 నుండి మే 1వ తేదీ వరకు సాయంత్రం 6.30 నుండి 9.30 గంటల వరకు ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలు జరుగనున్నాయి.

తిరుపతిలో..


తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఏప్రిల్ 29 నుండి మే 5వ తేదీ వరకు ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు సాహితీ సదస్సులు, సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మహతి కళాక్షేత్రంలో ఏప్రిల్ 29 నుండి మే 1వ తేదీ వరకు సాయంత్రం 6.00 నుండి సంగీత, నృత్య కార్యక్రమాలు జరుగనున్నాయి.

Source