
ఈ సందర్భంగా టిటిడి శ్రీశిరియకోయిల్ కేల్వి అప్పన్ శ్రీ గోవిందరామానుజ చిన్నజీయర్‌స్వామి మంగళాశాసనాలు అందించారు. ఆదిశేషుని అవతారమైన భగవద్ రామానుజులు శరణాగత భక్తిని విశేషంగా ప్రచారం చేశారని తెలిపారు. శ్రీమహావిష్ణువుకు ఆదిశేషుడు పాన్పుగా, ఆసనంగా ఉంటూ ప్రథమ సేవకుడిగా నిలిచాడని, భగవద్ రామానుజులు ఈ మార్గాన్నే అనుసరించారని వివరించారు. రామానుజార్యుల 1002వ అవతార మహోత్సవాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా ప్రాంతాల్లో టిటిడి నిర్వహించడం ముదావహమన్నారు.
అనంతరం తిరుపతికి చెందిన ఆచార్య సంపత్ కుమారాచార్యులు ”శ్రీ రామానుజ వైభవం”, తిరుపతికి చెందిన ఆచార్య టివి.రాఘవాచార్యులు ”శ్రీభాష్యం” అనే అంశాలపై ఉపన్యసించారు. ఆ తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి.
Source