
తరిగొండలో..
తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 27, 28వ తేదీల్లో ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, ఉదయం 9.30 గంటలకు ఆలయ ప్రాంగణంలోని తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుండి తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
తిరుపతిలో..
ఏప్రిల్ 27వ తేదీ ఉదయం 10.30 గంటలకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు జరుగనుంది. ఇందులో ప్రముఖ పండితులు పాల్గొని వెంగమాంబ రచనలపై ఉపన్యసిస్తారు. ఏప్రిల్ 27, 28వ తేదీల్లో సాయంత్రం 6.00 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తిరుమలలో..
ఏప్రిల్ 28వ తేదీన సాయంత్రం 6.00 నుంచి 8.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానంలోని శ్రీ పద్మావతి పరిణయోత్సవ మండపానికి ఊరేగింపుగా వేంచేపు చేస్తారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు.
Source