ఏప్రిల్‌ 11న ముళ్‌బాగాల్‌లో శ్రీనివాస కల్యాణం

టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 11వ తేదీ బుధవారం కర్ణాటక రాష్ట్రం కోలార్‌జిల్లా ముళ్‌బాగాల్‌లోని పిచ్చిగుంటహళ్ళిలోగల శ్రీ ఓం శక్తి ఆలయం ప్రాంగణంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశ విదేశాలలో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.

శ్రీవారి కల్యాణోత్సవం సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Source