మార్చి 16న ధ్వజారోహణం
శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు మార్చి 16వ తేదీ శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. ఈ సందర్భంగా గరుడ ధ్వజపటాన్ని ఆరోహణం చేసి సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత ఉదయం 11 గంటలకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ జరుగనున్నాయి. రాత్రి 8 గంటలకు పెద్దశేష వాహనసేవ ప్రారంభమవుతుంది. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు
తేదీ ఉదయం సాయంత్రం
- 16-03-2018(శుక్రవారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం
- 17-03-2018(శనివారం) చిన్నశేష వాహనం హంస వాహనం
- 18-03-2018(ఆదివారం) సింహ వాహనం ఉగాది ఆస్థానం/ ముత్యపుపందిరి వాహనం.
- 19-03-2018(సోమవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
- 20-03-2018(మంగళవారం) పల్లకీ ఉత్సవం గరుడ వాహనం
- 21-03-2018(బుధవారం) హనుమంత వాహనం వసంతోత్సవం/గజ వాహనం
- 22-03-2018(గురువారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
- 23-03-2018(శుక్రవారం) రథోత్సవం అశ్వవాహనం
- 24-03-2018(శనివారం) పల్లకీ ఉత్సవం/చక్రస్నానం ధ్వజావరోహణం.
Source