ఇందులో భాగంగా ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 5 గంటలకు శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను ఊరేగింపు శ్రీగోవిందరాజస్వామివారి ఆలయానికి తీసుకెళ్లి ఆస్థానం, ఖనిజంతోట ఉత్సవం నిర్వహించారు. అక్కడినుండి ఉత్సవమూర్తులను రామచంద్ర పుష్కరిణికి వేంచేపు చేశారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు తెప్పోత్సవం నిర్వహించారు.
విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతారామలక్ష్మణులు ఆశీనులై ఐదుచుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు.
Source