ఘనంగా నాగలాపురంలోని శ్రీ భక్త ఆంజనేయస్వామివారి ఆలయ సంప్రోక్షణ

నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీభక్త ఆంజనేయస్వామివారి ఆలయం అష్టబంధన ప్రతిష్ట, మహాసంప్రోక్షణలో భాగంగా పంచకవ్యాదివాసము, క్షీరాద్ధీ వాసము గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 25వ తేదీ వరకు జరగనుంది.

ఇందులో భాగంగా ఫిబ్రవరి 23న జలాధీవాసము, ఫిబ్రవరి 24న మహాశాంతి తిరుమంజనము, శాయానాధివాసము, ఫిబ్రవరి 25న అష్టబంధన ప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహించనున్నారు.

Source