మంగళవారం ఉదయం 6 నుండి 7 గంటల వరకు ఎస్.వి.సంగీత కళాశాల వారిచే మంగళధ్వని, ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు శివం పురాణ ప్రవచనం, మధ్యాహ్నం 11 నుంచి 1 గంట వరకు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులతో శివోహం భజన కార్యక్రమం, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు శివానందలహరి భక్తి సంగీతం నిర్వహిస్తారు.
అదేవిధంగా సాయంత్రం 6.30 నుంచి 9.30 గంటల వరకు పౌరాణిక నాటకం, రాత్రి 9.30 నుంచి 11.30 గంటల వరకు హరికథ, రాత్రి 11.30 నుంచి బుధవారం తెల్లవారుజామున 1 గంట వరకు తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి నమకం, చమకం, రుద్రం, శ్రీసూక్తం, పురుషసూక్తం పారాయణం చేస్తారు. తెల్లవారుజామున 1 గంట నుంచి 2.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శివ సంకీర్తనలు, ఉదయం 2.30 నుంచి 4.30 గంటల వరకు హరికథ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శివరాత్రి నాడు స్వామివారి కృపకు పాత్రులు కావాలని టిటిడి కోరుతోంది.
Source