ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3వ తేదీ వరకు అనంతవరం శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

టిటిడికి అనుబంధంగా ఉన్న గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం, అనంతవరం గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 3వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 20వ తేదీన ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 9 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనసేవ నిర్వహిస్తారు. మార్చి 1న రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామి అమ్మవార్లకు శాంతి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహంచనున్నారు. మార్చి 2వ తేదీ ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు గరుడ వాహనం, ధ్వజావరోహణం కార్యక్రమాలు జరుగనున్నాయి. అదేవిధంగా మార్చి 3న సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా జరుగనుంది.

బ్రహ్మూెత్సవాలను పురస్కరించుకుని ప్రతి రోజు సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజలసేవ ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మార్చి 18వ తేదీన ఉగాది సందర్భంగా ఉదయం 4 నుంచి 5 గంటల వరకు అభిషేకం, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పంచాంగ శ్రవణం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 17 నుంచి ఫాల్గుణ మాస శనివార ఉత్సవాలు


ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఫాల్గుణ మాస శనివార ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 24, మార్చి 3, మార్చి 10, మార్చి 17వ తేదీల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.

Source