చంద్రగ్రహణం ఏయే రాశివారిపై ఎటువంటి ప్రభావం చూపుతుంది?
ధనస్సు, మేషం, కర్కాటక, సింహ రాశుల వారికి అధమ ఫలం. వృశ్చిక, మకర, మీన, మిధున రాశుల వారికి మధ్యమఫలం కనిపిస్తుంది. కన్య, తుల, కుంభ, వృషభ రాశుల వారు మాత్రం శుభ ఫలాలను పొందుతారని విజ్ఞులు చెబుతున్నారు. గ్రహణం ఎవరికైనా గ్రహణమే కాబట్టి అన్ని రాశులవారు గ్రహణ నియమాలు పాటిస్తే శుభం కలుగుతుంది.
చంద్రగ్రహణం నాడు పాటించవలసిన నిబంధనలు!
ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని గర్భిని స్త్రీలు ప్రత్యేక్షంగా చూడ కూడదు,టివిలలో చూస్తే దోషం లేదు. గ్రహణకాలంలో మానసిక అలజడులకు దూరంగా ఉంటూ మనస్సులో భవంతున్ని ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది. గర్భిణి స్త్రీలు గ్రహణకాలంలో కదలకుండా పడుకోవాలి అనేది అవాస్తవం. ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చును, ఇందులో ఎలాంటి సందేహం లేదు.
నిలువ ఉంచే పచ్చల్లు,పిండి వంటలు,ముఖ్యమైన ఎక్కువరోజులు నిలువ ఉంచే ఆహార పదార్ధాలపై దర్భలు దర్భగడ్డి అని కూడా అంటారు వేయాలి. దీనివలన ఆహార పదార్ధాలకు గ్రహణ ప్రభావము పడకుండా కాపాడబడతాయి. ఆ వేళలో ఆహార పానీయ నియమాలు అన్ని వయస్సులవారు గ్రహణానికి మూడు గంటల ముందుగానే ఘన పదార్ధాలు,భోజనాలు పూర్తి చేసుకోవాలి. ద్రవ పదార్ధాలు తీసుకోవచ్చును.
Also Read: అరుదైన చంద్రగ్రహణం… సూపర్ బ్లూ బ్లడ్ మూన్…
గ్రహణము పూర్తి అయిన తర్వాత తలస్నానంచేసి వంటిల్లు శుభ్రపరచుకుని తాజాగా వంట చేసుకొని తినాలి. ఉదయం చేసిన అన్నం కూరలు మొదలగునవి తినడానికి పనికి రాదు. గ్రహణ సమయంలో నిలువఉన్న ఆహర పధార్ధాలు విషస్వభావాన్ని కలిగి ఉంటాయి. అవి తింటే వెంటనే వాటి స్వభావాన్ని తక్షణం చూపకపోయినా నెమ్మదిగా శరీరానికి అస్వస్థత కలిగిస్తాయి. గ్రహణము పట్టే సమయానికి ముందు,తర్వాత పట్టు,విడుపు స్నానాలు చేసి భగవంతుని ధ్యానం చేస్తే గ్రహదోషాల బారినుండి పాక్షికంగా ఊరట లభించవచ్చు. అయితే చేయాల్సిన పరిహారాలు మాత్రం తప్పనిసరిగా చేయాలి.