తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. తెప్పలను అధిరోహించిన స్వామివారు శ్రీ గోవిందరాజస్వామివారి పుష్కరిణిలో మొత్తం ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిస్తారు.

కాగా బుధవారంతో తెప్పోత్సవాలు ముగియనున్నాయి. జనవరి 31వ తేదీ చంద్రగ్రహణం కారణంగా రాత్రి 10.00 నుండి 12.00 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై ఏడుచుట్లు తిరిగి భక్తులను కటాక్షించనున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
Source