సంక్రాంతి సంబరాల్లో భాగమైన గొబ్బిళ్ళ పండుగలో పాడుకును గొబ్బిళ్ల పాటలు మీ కోసం భక్తిసారం అందిస్తోంది.ఈ వీడియోలో ‘చిన్ని కృష్ణయ్య కనిపించడాయే’ అనేపాట అందిస్తున్నాము.
సంక్రాంతి సంబరం అంతా గొబ్బిళ్ల వేడుకలలోనే కనిపిస్తుంది. ఇంటిముందు రంగవల్లుల్లాంటి కొత్త బట్టలు ధరించిన ఆడపిల్లు సప్తవర్ణాలు అద్దిన రంగవల్లుల మధ్యలో గొబ్బెమ్మలు ఉంచి వాటిని పూజించి అనంతరం గొబ్బిళ్ళ పాటలు పాడుతుంటే ఆ అందం ఆనందం మరొక సందర్భంలో రాదంటారు పెద్దలు. కానీ మన సనాతన సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో మనం మర్చిపోతున్న గొబ్బెమ్మల పాటను మీకు గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా గొబ్బిపాటలను మీకు అందిస్తున్నాం.
వేణు గానమును వినిపించేనే
వేణు గానమును వినిపించేనే
చిన్ని కృష్ణయ్య కనిపించడాయే కనిపించడాయే
చిన్ని కృష్ణయ్య కనిపించడాయే కనిపించడాయే
మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట
మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట
లేదు లేదనుచూ లోకాలూ చూపావటా
లేదు లేదనుచూ లోకాలూ చూపావటా
ఇంత మొనగాడాటే కట్టుకథలేనటే
ఇంత మొనగాడాటే కట్టుకథలేనటే
ఏడి కనిపిస్తే ఏడి కనిపిస్తే
నిలదీసి అడగాలి వానినీ
వేణు గానమును వినిపించేనే ఏ
చిన్ని కృష్ణయ్య కనిపించడాయే కనిపించడాయే
చిన్ని కృష్ణయ్య కనిపించడాయే కనిపించడాయే
గొడుగు కృష్ణయ్యా మడుగులోకి దూకాడట
గొడుగు కృష్ణయ్యా మడుగులోకి దూకాడట
ఝడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
ఝడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
గజ్జె ఘల్ ఘల్ మానా గుండె ఝల్ ఝల్ మానా
గజ్జె ఘల్ ఘల్ మానా గుండె ఝల్ ఝల్ మానా
ఏడి కనిపిస్తే ఏడి కనిపిస్తే నిలదీసి అడగాలి వానినీ
వేణు గానమును వినిపించేనే ఏ
చిన్ని కృష్ణయ్య కనిపించడాయే కనిపించడాయే
వేణు గానమును వినిపించేనే