గొబ్బెమ్మల వెనుక దాగి ఉన్న పరమార్ధం



ఉదయాన్నే గొబ్బెమ్మలను ముగ్గులలో ఉంచి, వాటిపై గుమ్మడి పూలతో అలంకారం చేసే చిత్రాలు పల్లె అందాలను ద్విగుణీకృతం చేస్తాయి. గొబ్బెమ్మల పూజ అనేది మన తెలుగు సంప్రదాయం. ఈ వీడియోలో గొబ్బెమ్మల వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏమిటో తెలుసుకుందాం.

ఉదయాన్నే గొబ్బెమ్మలను ముగ్గులలో ఉంచి, వాటిపై గుమ్మడి పూలతో అలంకారం చేసే చిత్రాలు పల్లె అందాలను ద్విగుణీకృతం చేస్తాయి. గొబ్బెమ్మల పూజ అనేది మన తెలుగు సంప్రదాయం.


సంస్కృతి వైభవాన్ని చాటి చెబుతుంది

సంక్రాంతి పండుగ మన సంస్కృతి వైభవాన్ని చాటి చెబుతుంది. ఇంటి ముందు రంగవల్లులు, హరిదాసులు, డూ డూ బసవన్నలు, ముంగిట గొబ్బెమ్మలు వంటి సాంప్రదాయ వేడుకలు దర్శనం ఇస్తాయి. వీటిలో గొబ్బెమ్మలు మన అచ్చతెలుగు సాంప్రదాయానికి అద్దం పడతాయి. ఇంటి ముందు ఆడపిల్లలు అందరూ గొబ్బెమ్మల పూజ చేస్తూ, గొబ్బిపాటలు పాడుతూ ఆడుతూ ఉంటే సంక్రాంతి సందడికి ఇంతకంటే నిదర్శనం ఏముందనిపిస్తుంది.