గ్రహాల అనుగ్రహం కోసం పఠించాల్సిన స్తోత్రాలు



గ్రహాల అనుగ్రహం లేకపోతే మన జీవన గమనం గాడి తప్పుతుంది. అందుకే ఆయా గ్రహాల అనుగ్రహం కోసం వారిని స్తుతించాలి. అందుకే నవ గ్రహాల అనుగ్రహం పొందడానికి పఠించాల్సిన నవగ్రహ పీడా హర స్తోత్రాలను ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. ప్రతి శ్లోకం నిర్దేశించబడిన సంఖ్యలో పఠిస్తే గ్రహాలు శాంతిస్తాయి. వారి అనుగ్రహన్ని మనపై ప్రసరింప చేస్తాయి. ఈవీడియోలో ప్రతీ శ్లోకం ముందు దాన్ని పఠించాల్సిన సంఖ్యను కూడా ఇవ్వడం జరిగింది. ప్రతీరోజు ఉదయాన్నే స్నానం చేసి ఈ స్తోత్రాలను జపించాలి. సూచించినంత సంఖ్యలో ఒకే రోజు పఠనం చేయడం సాధ్యం కాదు, అందుకే ప్రతీరోజు మీకు వీలైనంత సంఖ్యను ఎంచుకుని శ్లోకాలను చదువుకుంటూ కొంతకాలం సమయంలో నిర్ణీత సంఖ్యను పూర్తిచేయవచ్చు.

ఏ గ్రహ స్తోత్రం ఎన్నిసార్లు జపించాలి?




సూర్యగ్రహ పీడా హర స్తోత్రాన్ని 6వేల సార్లు జపించాలి
చంద్రగ్రహ పీడా హర స్తోత్రాన్ని 10వేల సార్లు జపించాలి
కుజగ్రహ పీడా హర స్తోత్రాన్ని 7వేల సార్లు జపించాలి
బుధగ్రహ పీడా హర స్తోత్రాన్ని 17వేల సార్లు జపించాలి
గురుగ్రహ పీడా హర స్తోత్రాన్ని 16వేల సార్లు జపించాలి
శుక్రగ్రహ పీడా హర స్తోత్రాన్ని 20వేల సార్లు జపించాలి
శనిగ్రహ పీడా స్తోత్రాన్ని 19వేల సార్లు జపించాలి
కేతుగ్రహ పీడా హర స్తోత్రాన్ని 7వేల సార్లు జపించాలి
రాహుగ్రహ పీడా హర స్తోత్రాన్ని 18వేల సార్లు జపించాలి

నవగ్రహ పీడా హర స్తోత్రములు


సూర్యుడు :


గ్రహాణామాది రాదిత్యో లోక రక్షణకారకః

విషమస్థాన సంభూతం పీడాం హరతుమేరవిః

చంద్రుడు:


రోహిణీశస్సుధామూర్తిస్సుధాగా త్రస్సురాశనః

విషమస్థాన సంభూతం పీడాం హరతుమేవిదుః

కుజుడు :


భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్నదా

వృష్టికృదృష్టి హర్తాచ పీడాం హరతు మేకుజః

బుధుడు


ఉత్పాత్రూపోజగతాం చంద్రపుత్రో మహాద్యుతిః

సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతుమే బుధః

గురుడు


దేవమంత్రీ విశాలాక్షః సదాలోకహితే రతః

అనేక శిష్య సంపూర్ణః పీడాం హరతుమే గురుః

శుక్రుడు


దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చమహామతిః

ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాం హరతుమే భ్రుగుః

శని


సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియః

మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతుమే శనిః

కేతువు


మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః

అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతుమే శిఖీ

రాహువు


అనేక రూప్వర్వైశ్చ శతశో ధసహస్రశః

ఉత్పాతరూపో జగతాం పీడాం హరతుమే తమః