వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారంనాడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు జరుగుతుంది. ఈ నెల 29న వైకుంఠఏకాదశి సందర్భంగా మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందులోభాగంగా ఉదయం 6 నుండి 10 గంటల వరకు గర్భాలయం, ఉప ఆలయాలు, పోటులను అర్చకులు ఆగమోక్తంగా శుద్ధి చేశారు. ఆలయ సిబ్బంది అత్యంత భక్తిశ్రద్ధలతో శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. శుద్ధి కార్యక్రమం అనంతరం 11 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభమైంది.
Source