కంచి స్వామీజీల ఆశీస్సులు అందుకున్న టిటిడి ఈవో


టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బుధవారం నాడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కంచిలోని శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి, శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివార్ల ఆశీస్సులు అందుకున్నారు.

తిరుమలలో శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో కారీరిష్టి యాగం నిర్వహించిన విషయం విదితమే. ఈ యాగ ఫలితంగా ఇటీవల తిరుమలలో విస్తారంగా వర్షాలు కురిసి జలాశయాల్లో నీటిమట్టం పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి, శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివార్లను టిటిడి ఈవో కృతజ్ఞతాపూర్వకంగా కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
Source