శ్రీకపిలేశ్వరాలయంలో వైభవంగా లక్ష బిల్వార్చన


తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం లక్ష బిల్వార్చన సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులోభాగంగా ఉదయం 3.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహించారు. యాగశాల మండపంలో ఉదయం 6.00 నుంచి 12.00 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ వైభవంగా జరిగింది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చించారు.
ఈ సందర్భంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పించారు. అదేవిధంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీకపిలేశ్వరస్వామి, శ్రీకామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఘనంగా ఊరేగించనున్నారు.