తిరుమలలోని వివిధ అతిథిగృహాల నిర్వహణపై తిరుమల జె.ఈ.ఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు శుక్రవారంనాడు అన్నమయ్య భవనంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇందులో భాగంగా ఆయన గతనెల 10వ తారీఖున ఇంజనీరింగ్ అధికారుల బృందంతో తిరుమలలోని వివిధ అతిథి గృహాలలో నిర్వహించిన తణిఖీలకు సంబంధించిన నివేదికపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో తిరుమలలో కాటేజీలకు సంబంధించిన హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో భక్తులే నేరుగా ఆ నెంబరుకు ఫోన్‌చేసి సమస్యను తెలిపే సౌకర్యాన్ని తి.తి.దే ప్రవేశపెట్టనుందని తెలిపారు.
అంతకు మునుపే విడిదిగృహాల్లో చేయవలసిన సివిల్, ఏలక్ట్రికల్, ఎప్.యం.ఎస్‌కు సంబంధించిన సమస్యలు ఉంటే వాటిని వెనువెంటనే పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు.