ఆన్‌లైన్‌లో 50,879 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల


శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2018 జనవరి నెల కోటాలో మొత్తం 50,879 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 6,744 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 4,104, తోమాల 50, అర్చన 50, అష్టదళపాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 2300 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు. 

ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో మొత్తం 44,135 సేవాటికెట్లు కాగా, వీటిలో విశేషపూజ 1,500, కల్యాణం 10,125, ఊంజల్‌సేవ 2,700, ఆర్జితబ్రహ్మూెత్సవం 5,805, వసంతోత్సవం 11,180, సహస్రదీపాలంకారసేవ 12,825 ఉన్నాయని వివరించారు.