ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్ధామ్||
పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ
సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం
నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత
మొదటి అవతారం శైలపుత్రి
వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్
అమ్మవారికి పసుపు రంగు అంటే ఇష్టం ఈ రోజున లేత పసుపుచర్చ రంగు వస్త్రాలు ధరించి మాతను ఆరాధిస్తే మంచిదని చెబుతున్నారు పెద్దలు.
రెండవ అవతారం బ్రహ్మరారిణి
దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా
అంటూ మాతను ఆరాధించాలి, బ్రహ్మచారిణి మాతకు అత్యంత ఇష్టమైన రంగు ఆకుపచ్చ. ఈ రోజున లేత ఆకుపచ్చరంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి కొలిస్తే మంచిది
మూడవ అవతారం చంద్రఘంట
పిండప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా
అంటూ దేవిని ఆరాధించాలి, ఈ తల్లికి అత్యంత ఇష్టమైన రంగు మేఘవర్ణం అంటే కొచెంబూడిదరంగులో ఉంటే తెలుపు రంగు అన్నమాట. ఈ రోజున తెల్ల రంగు లేదా బూడిద రంగు వస్త్రాలు ధరించి అమ్మవారిని ఆరాధిస్తే శుభం కలుగుతుంది
నాలుగవ అవతారం కూష్మాండ
సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ
దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభదాస్తుమే
అంటూ దేవిని ఆరాధించాలి, కూష్మాండా దేవికి అత్యంత ఇష్టమైన రంగు
నారింజపండు రంగు లేదా కనకాంబరం రంగు. ఈ రోజున లేత కనకాంబరం రంగు
వస్త్రాలు ధరించి దేవిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది.
ఐదవ అవతారం స్కందమాత
సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా
శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ
అంటూ దేవిని ఆరాధించాలి, స్కందమాతకు అత్యంత ఇష్టమైన రంగు
తెల్లని తెలుపు రంగు. ఈ రోజున పాలనురుగు లాంటి తెల్లరంగు
వస్త్రాలు ధరించి మాతను ఆరాధిస్తే మనసు నిర్మలంగా ఉంటుంది.
ఆరవ అవతారం కాత్యాయని దేవి
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా|
కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ||
అంటూ కాత్యాయనీ దేవిని ఆరాధించాలి, ఈ దేవికి అత్యంత ఇష్టమైన రంగు
ఎరుపు. ఈ రోజున లేత ఎరుపు రంగు
వస్త్రాలు ధరించి దేవిని ఆరాధించడం శుభకరం
ఏడవ అవతారం కాళరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ
వామపాదోల్లసల్లోహ లతాకంటక భూషణా
వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ
అంటూ మాతను ఆరాధించాలి, కాళరాత్రి వర్ణం నలుపైనప్పటికీ దేవికి అత్యంత ఇష్టమైన రంగు
నీలం రంగు. ఈ రోజున లేత నీలం రంగు
వస్త్రాలు ధరించి దేవిని ఆరాధిస్తే సుఖశాంతులు లభిస్తాయి.
ఎనిమిదవ అవతారం మహాగౌరి
శ్వేతే వృషే సమారూడా శ్వేతాంబరధరా శుచి:|
మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా||
అంటూ గౌరీదేవిని ఆరాధించాలి, గౌరీమాతకు గులాబిరంగు అంటే ఇష్టం
గులాబీ రంగు లేదా లేత ఎరుపు రంగు దుస్తులు ధరించి
మహాగౌరిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది.
చివరగా తొమ్మిదవ అవతారం సిద్దిధాత్రి
సిద్ధగంధర్వ యక్షాద్యై రసురై రమరైరపి|
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ||
అంటూ సిద్దిధాత్రిని దేవికి వూదా రంగు అంటే ఇష్టం. ఈ రోజున లేత బచ్చలిపండు రంగు
అంటే వూదా రంగు వస్త్రాలు ధరించి దేవిని ఆరాధిస్తే సకల సిద్దులూ ప్రాప్తిస్తాయి.