1500 మంది కళాకారులతో బ్రహ్మూెత్సవాల్లో కళాప్రదర్శనలు


శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల్లో మొత్తం 1500 మంది కళాకారులతో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి తెలిపారు. 

ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు బ్రహ్మూెత్సవాల్లో ప్రదర్శనలిస్తున్నట్టు తెలిపారు. 

వాహనసేవలతోపాటు తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలో ధార్మిక, సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. 


టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌తో పాటు అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియజేశారు. ఇందులో భక్తి సంగీతం, భజనలు, కోలాటాలు, తప్పెటగుండ్లు, పిల్లనగ్రోవి నృత్యాలు, డప్పు వాయిద్యం తదితర కళాప్రదర్శనలు ఉన్నాయని వివరించారు. 

నాదనీరాజనం వేదికపై ప్రముఖ కళాకారుల నామసంకీర్తనం, గాత్ర, నృత్య కార్యక్రమాలు జరుగుతున్నాయని, వాహనసేవల్లో వ్యాఖ్యానం అందించేందుకు ప్రముఖ పండితులను ఏర్పాటుచేశామని చెప్పారు.