భాద్రపద మాసం విశిష్టతలు విశేషాలు || Significance of Bhadrapada masam

బాధ్రపదమాసం మనకు రెండు విషయాల్లో కీలకమైన మాసం. వినాయకచవితి పర్వదినం వచ్చేది ఈ మాసంలోనే.. అలాగే పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధుల వంటి కార్యక్రమాలు ఈ మాసంలో చేస్తారు దీనినే మాహాలయ పక్షం అంటాం. అంటే భాద్రపద మాసంలోని శుక్లపక్షం అంటే ఈ మాసంలోని పాడ్యమి తిధి మొదలు పౌర్ణమి వరకూ దేవతాపూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, పౌర్ణమి వెళ్లిన పాఢ్యమి నుంచి అమావాస్య వరకూ ఉండే కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా గుర్తిస్తారు అంతటి గొప్ప మాసం గురించిన విశేషాలు ఈ వీడియోలో చూద్దాం రండి.