తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 1 నుండి 3వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు 31వ తేదీన పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు.
సెప్టెంబరు 1న పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 2న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పణ ఉంటుంది. సెప్టెంబరు 3న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ మూడు రోజుల పాటు ఉదయం స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
గృహస్తులు(ఇద్దరు) రూ.500/- టికెట్ కొనుగోలు చేసి ఈ పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గ హస్తులకు ఒక పవిత్రం ప్రసాదంగా అందజేస్తారు.