తిరుమల దర్శనార్థం కాలినడకన వస్తున్న భక్తులకు టోకెన్ల జారీ విధానాన్ని తెలియజేసేందుకు అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో 5 భాషల్లో ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేయాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్.శ్రీనివాసరాజు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శ్రీవారిమెట్టు, అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను సోమవారం సాయంత్రం అధికారులతో కలిసి జెఈవో పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీవారిమెట్టు నడకమార్గంలో ఏర్పాటుచేసిన నాలుగు టోకెన్ల జారీ కౌంటర్లను అవసరాన్ని బట్టి వినియోగించాలని సూచించారు. ఈ మార్గంలో ఉన్న వ్యర్థాలను తొలగించాలన్నారు. అలిపిరి నడకదారిలోని టోకెన్ జారీ కౌంటర్ వద్ద ఎక్కువ మంది భక్తులు వేచియుండే అవకాశం ఉందని, వారి సౌకర్యార్థం ఇక్కడ షెడ్, తాగునీటి ప్లాంట్లు, మరుగుదొడ్లు విరివిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులకు సమాచారం తెలిపేలా అలిపిరి మొదటి మెట్టు నుంచి అవసరమైన ప్రాంతాలలో ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు.
అనంతరం అలిపిరి వద్ద టోకెన్ మంజూరు కౌంటర్లను, భక్తులను తనిఖీచేసే విధానాన్ని పరిశీలించారు. అలిపిరి మార్గంలో టోకెన్ల జారీపై కాలినడక భక్తుల స్పందన ఎలా ఉందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. టోకెన్లు జారీ చేసి త్వరితగతిన శ్రీవారి దర్శనం చేయిస్తుండటంపై జెఈవో ఎదుట పలువురు భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
Source

గరుడ సేవ కోసం పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించిన జెఈవో
శ్రీవారి బ్రహ్మూెత్సవాలలో భాగంగా గరుడసేవ రోజున విశేషసంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం వాహనాల పార్కింగ్ స్థలాలను సోమవారం సాయంత్రం అధికారులతో కలిసి జేఈవో పరిశీలించారు. జూపార్క్ సమీపంలో నిర్మాణంలో ఉన్న దేవలోక్ ప్రాంగణం, భారతీయ విద్యాభవన్ పాఠశాల మైదానం, ఎస్వీ మెడికల్ కళాశాల మైదానం, అలిపిరి సర్కిల్ వద్ద గల ప్రాంతాలలో పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.Source